ఆలియా భట్ తన 30వ పుట్టినరోజును బుధవారం జరుపుకున్నారు. రీసెంట్‌గా రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ముంబైకి చేరుకున్నారు ఆలియా. రెడ్ వెల్వెట్ కేక్ కట్ చేసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. తన ప్రతి ఎమోషన్‌నీ చక్కగా వ్యక్తం చేయగలగడం ఆలియా బలం అని అన్నారు రణ్‌బీర్ కపూర్. తన ఇంటి కోడలు మారాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు రణ్‌బీర్ తల్లి.
ఆలియా పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
*ఆలియా మంచి నటి మాత్రమే కాదు, చక్కటి బిజినెస్ ఎంట్రప్రెన్యుర్. పర్సనల్ ఫ్యాషన్ స్టైలిస్ట్ బ్రాండ్ స్టైల్ క్రాకర్‌ని మెయింటెయిన్ చేస్తున్నారు. ఫూల్ అనే ఫ్లోరల్ వేస్ట్స్ ని ప్రాడెక్టులుగా మార్చే కాన్‌పూర్ ఐఐటీ బ్యాక్డ్ డీటూసీ బ్రాండ్ ఆమెదే.
* కమర్షియల్ వరల్డ్ లో ఆలియాకి స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఆమె రోజుకు 2-3కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు.
* ఆలియా స్టార్ట్ చేసిన కిడ్స్ వేర్ కేటగిరీ ఎడ్ ఎ మమ్మా ఇప్పుడు 150 కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది.
* 2020లో ఆలియా సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ఆమెదే. డార్లింగ్స్ అని తొలి సినిమాను తెరకెక్కించారు. షారుఖ్ ఖాన్‌తో కలిసి తెరకెక్కించిన ఈ సినిమా 80 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది.
* ముంబైలో 35 కోట్ల రూపాయల ఇల్లు ఆలియా పేరు మీద ఉంది. లండన్‌లోనూ ఆమెకు లగ్జరీ హౌస్ ఉంది.
* ప్రతి సినిమాకూ ఆలియాకు 15-18-20 కోట్ల మధ్య పారితోషికం అందుతుంది.
* ఆలియా ఇండియన్ సిటిజన్ కాదు. ఆమెకు బ్రిటిష్ సిటిజన్‌షిప్ ఉంది. ఆమె తల్లి రజ్‌దాన్ బ్రిటిష్ సిటిజన్. అందుకే ఆలియాకు కూడా బ్రిటిష్ సిటిజన్‌షిప్ వచ్చింది.
* గతేడాది వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా, ఇప్పుడు మళ్లీ షూటింగులతో బిజీ అయ్యారు.